కరీంనగర్‌లో 31న జాబ్ మేళా

కలం, కరీంనగర్: కరీంనగర్( Karimnagar) జిల్లా కేంద్రంలో ఈ నెల 31న జాబ్ మేళా జరగనుంది. ప్రైవేట్ రంగ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎన్ఐఐటీ, వి ప్రాసెస్ సంయుక్తంగా మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కందుకూరి సత్యనారాయణ సోమవారం తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పొన్నం కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వి ప్రాసెస్ కార్యాలయానికి రావాలన్నారు. డిగ్రీ పూర్తి చేసి 25 ఏళ్ల లోపు ఉన్న పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు..

తెలంగాణ వ్యాప్తంగా 100 రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నట్లు సత్యనారాయణ వివరించారు. ఏడాదికి రూ.3.26 లక్షల నుంచి రూ.3.80 లక్షల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హులైన వారు విద్యార్హత పత్రాలు, రెజ్యూమ్‌తో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 9553723414, 9581295458, 9963908950 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>