కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి క్రాస్ వద్ద అదుపుతప్పిన లారీ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుండి పాలకుర్తికి వెళ్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి (Jhansi Reddy) సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఝాన్సీ రెడ్డి తెలిపారు.

