ఆసియా గేమ్స్‌లో జపాన్‌కు తొలి స్వర్ణం

కలం, స్పోర్ట్స్ : ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న 20వ ఆసియా గేమ్స్‌ పోటీల్లో ఆతిథ్య జపాన్ (Japan) బోణీ కొట్టింది. ఆదివారం పురుషుల ఇండివిజువల్ ట్రయాథ్లాన్‌లో జపాన్ క్రీడాకారుడు తకుమి హోజో తొలి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఆయన 52 నిమిషాల 56 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన ఝాంగ్ క్సిరుయ్ రజతం గెలవగా, కజకిస్థాన్‌కు చెందిన అర్లాన్ జానాబాయెవ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో హోజో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

అయితే మహిళల ట్రయాథ్లాన్‌లో చైనాకు చెందిన లిన్ క్సిన్యు 57 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. మరోవైపు ఈత కొలనులోనూ చైనా క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లై హీట్స్‌లో 13 ఏళ్ల చైనా స్విమ్మర్ యు జిడి అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో ఒలింపిక్ ఛాంపియన్ పాన్ ఝాన్లే 48.07 సెకన్లలో రౌండ్ పూర్తి చేసి ఫైనల్‌కు చేరాడు.

ఇక హాకీ విభాగంలో చైనా మహిళల జట్టు 13-0తో బంగ్లాదేశ్‌పై, భారత మహిళల జట్టు 19-0తో ఉజ్బెకిస్తాన్‌పై భారీ విజయాలు నమోదు చేశాయి.అయితే క్రీడా గ్రామం లేకపోవడంతో అథ్లెట్లకు వసతి సమస్యలు తలెత్తాయి. దాంతో పాటు టైఫూన్ ‘దుజువాన్’ తుఫాను ప్రభావంతో టోక్యోలో ఈక్వెస్ట్రియన్ పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. వర్ష సూచనలు ఉన్నప్పటికీ, మ్యాచ్‌లను సజావుగా పూర్తి చేసేందుకు నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>