కలం, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర శంభాజీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ మేరకు జాతీయ స్థాయి వర్కింగ్ కమిటీని ప్రకటించారు. రాబోయే ఆరు నెలల్లో దేశ వ్యాప్తంగా లోక్ సభ నియోజకవర్గాలు, రాష్ట్ర స్థాయి, నగరాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. నియమించిన సభ్యులంతా 35 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.
పది మందితో ఏర్పాటు..
కాక్రోచ్ జనతా పార్టీకి జాతీయ కన్వీనర్‌గా అభిజిత్ దీప్కే వ్యవహరిస్తారు. కో–కన్వీనర్లుగా అశుతోష్ రంకా, సౌరవ్ దాస్, జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జిగా అజింక్యా షిండే, సహాయ ఇన్‌ఛార్జిగా దీపక్ బలియన్ నియమితులయ్యారు. జాతీయ కార్యదర్శిగా ఆఫ్రిన్ నవాజ్, మీడియా విభాగానికి మల్లంగి విజయ్ రెడ్డి, లీగల్ సెల్ విభాగానికి రత్నా సింగ్, పార్టీ పరిశోధన విభాగానికి వైష్ణవి గౌర్, టెక్నికల్ విభాగానికి రోహన్ దేశ్‌పాండే, ఆర్థిక సేవల విభాగానికి యోగేశ్ ఇంగాలేను ఇన్‌ఛార్జులుగా ప్రకటించారు.
నాలుగు జోన్లకు కూడా..
జాతీయ స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సీజేపీ.. దేశంలోని నాలుగు కీలక జోన్లకు కూడా ఇన్‌ఛార్జులను నియమించుకుంది. ఉత్తర్ జోన్‌కు దీపక్ బలియన్, దక్షిణ జోన్‌కు మల్లంగి విజయ్ రెడ్డి, తూర్పు–ఈశాన్య జోన్లకు కలిపి అంకిత్ భరద్వాజ్, పడమర జోన్‌కు యోగేశ్ ఇంగాలేను ఇన్‌ఛార్జులుగా నియమితులయ్యారు. పక్కా ప్రణాళికతో జాతీయ, జోన్ల కమిటీలను ప్రకటించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇక నుంచి జనాల్లోకి మరింత బలంగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

