స్నేహ గ్రూప్‌పై ఐటీ మెరుపు దాడులు.. 16 చోట్ల తనిఖీలు!

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ సంస్థ స్నేహ గ్రూప్‌ (Sneha Group)పై ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్, విజయవాడ సహా పలు చోట్ల ఉన్న సంస్థ ప్రధాన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా డైరెక్టర్లు రామ్ రెడ్డి డెండి, వరుణ్ రెడ్డి డెండి, స్నేహ డెండి నివాసాల్లో ఐటీ బృందాలు రికార్డులను పరిశీలిస్తున్నాయి.

హైదరాబాద్ కొండాపూర్ కేంద్రంగా పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ రంగాల్లో స్నేహ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1982లో రామ్ రెడ్డి చికెన్ మార్కెట్‌గా ప్రారంభమైన ఈ వ్యాపారం, 1994లో స్నేహ ఫామ్స్‌గా విస్తరించి అగ్రగామి సంస్థగా ఎదిగింది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన తర్వాతే ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>