కలం, వనపర్తి: రేవల్లి మండలం కేశంపేట (Keshamapet) గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శివ భక్త బృందం ఆధ్వర్యంలో ‘ఇరుముడి’ మూవీని ప్రదర్శించారు. వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై చిత్రాన్ని వీక్షించారు. భక్తి భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో శివ భక్త బృందం సభ్యులు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆధ్యాత్మికత, సామాజిక సందేశంతో కూడిన చిత్రాలు యువతలో భక్తిభావాన్ని, సన్మార్గాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని గ్రామస్థులు పేర్కొన్నారు.

