Mobile Popup Ad
Mobile Popup Ad

ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ల దాడి

కలం, డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా దాడులతో పశ్చిమ ఆసియా దద్దరిల్లిపోతోంది (Iran–Israel War). బాంబుల వర్షంతో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. దీంతో ఇరాన్ ప్రతీకార చర్యలను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ మీద వరుస దాడులతో (Iran–Israel War) హడలెత్తిస్తోంది. తాజాగా మరోసారి డ్రోన్లు, మిస్సైళ్ల దాడులతో విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్ కూడా ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇరాన్ డ్రోన్లను గాల్లోనే పేల్చేసింది ఇజ్రాయెల్.

అటు గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. దుబాయ్ మీద డ్రోన్ల దాడితో విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు దిగుతోంది ఇరాన్. దీంతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం భయంకరంగా మారింది. తాజాగా షార్జాలోని ఓ పెద్ద షాపింగ్ మాల్ మీద ఇరాన్ దాడి చేసింది. షాపింగ్ మాల్ లో వందల మంది ఉన్నట్టు సమాచారం. అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. యూఎస్ హద్దులు మీరిందని.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపింది. ఇరాన్ ప్రకటనపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇరాన్ ప్రతీకారానికి దిగకపోతేనే మంచిదని.. లేదంటే దాడులు మరింత పెంచుతామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>