Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రపంచ ర్యాంకింగ్‌లో మెరిసిన‌ ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్

క‌లం, మెద‌క్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా కందిలో భారతీయ సాంకేతిక విద్యా సంస్థ హైదరాబాద్ క్యాంపస్‌ (IIT Hyderabad) QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ స‌త్తా చాటింది. 2027 సంవత్సరానికి సంబంధించి గణనీయమైన పురోగతిని నమోదు చేస్తూ గ్లోబల్ ర్యాంక్ 588ను సాధించింది. గత ఏడాది 664వ స్థానంతో ఉండగా, ప్రస్తుతం 76 స్థానాలు మెరుగుపర్చుకుంది. ఐఐటీ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సంస్థలలో ఒకటిగా నిలిచింది. క్యాంపస్‌ పురోగతి, పరిశోధనలో ప్రతిభ, నూతన విద్య విధానాలు సాంకేతిక అభివృద్ధి రంగాలలో ఐఐటీ హెచ్ క్యాంపస్‌ త‌న స్థాయిలో మరింతగా పెంచుకుంటూ అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తుంది.

ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ ప‌రిశోధ‌న ప‌త్రాల‌ సూచీలో (సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ) అద్భుత ఫలితాలు సాధించినది. ఈ విభాగంలో ఐఐటీ హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో 123వ ర్యాంక్ సాధించింది. ఈ సూచీలో సంస్థ స్కోరు 86.8కి పెరిగింది. ముఖ్యంగా ఐఐటీ హెచ్ లోని ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ మరియు రిసెర్చ్ స్కాల‌ర్స్, పరిశోధనల ప్రభావం, నాణ్యమైన పరిశోధనలు, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించింది. ప‌లు విభాగాల్లో చేస్తున్న పరిశోధనల ఫలితంగా ప్రస్తుతం ప్రకటించిన ర్యాంకింగ్‌లో, పనితీరులో గణనీయమైన మెరుగుదల కనబర్చింది. ప్రపంచవ్యాప్తంగా ర్యాంక్ పొందిన సంస్థలలో 61 శాతం కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. భారతదేశానికి సంబంధించిన మొత్తం 52 సంస్థలు ఉండ‌గా, మ‌న దేశ‌ ర్యాంకింగ్‌లో ఐఐటీ హెచ్ 17వ స్థానం, పరిశోధనల విభాగ‌ పరంగా 14వ జాతీయ స్థానం సాధించింది. విద్యా సంస్ధ ప్ర‌మాణాలు, ఉద్యోగుల ప‌నితీరు, సంస్థ సాధించిన ఫలితాలు సుస్ధిర‌త‌ వంటి కీలక సూచీలలో కూడా మెరుగైన‌ పురోగతి నమోదు చేసుకుంది. ఐఐటీ హైదరాబాద్ సంస్థ మొత్తం స్కోరు 28.7కి చేరుకోగా, ప్రపంచ స్థాయిలో పనితీరు 55.9 శాతం నుంచి 61.0 శాతానికి పెరిగింది.

ఏడాది వారీగా పురోగతి

2027 – గ్లోబల్ ర్యాంక్ 588 | పరిశోధన పత్రాల‌ సూచీలో గ్లోబల్ ర్యాంక్ 123 | ప్రపంచ సంస్థలలో 61.0% కంటే మెరుగైన ప్రదర్శన
2026 – గ్లోబల్ ర్యాంక్ 664 | స్కోరు 84 | ప్రపంచ సంస్థలలో 55.9% కంటే మెరుగైన ప్రదర్శన
2025 – గ్లోబల్ ర్యాంక్ 681–690 | స్కోరు 71.1 | ప్రపంచ సంస్థలలో 54.2% కంటే మెరుగైన ప్రదర్శన
2024- గ్లోబల్ ర్యాంక్ 691–700

గత కొన్ని సంవత్సరాలుగా ఐఐటీ హైదరాబాద్ స్థిరంగా తన అంతర్జాతీయ స్థాయిని మెరుగుపరుచుకుంటూ వ‌స్తున్న‌ది, 2024 లో 691-700 ర్యాంకు తో మొద‌లై క్ర‌మంగా మెరుగుప‌ర్చుకుంటూ ఇప్పుడు 2027లో 588వ స్థానానికి చేరుకుంది. వివిధ విభాగాల‌కు సంబంధించిన అత్యుత్తమ నాణ్యత ప్ర‌మ‌ణాల‌తో కూడిన‌ పరిశోధనలు చేయ‌డంతో పాటు, ప‌రిశోధ‌న‌ల సంద‌ర్భంగా క్యాంపాస్ లోని వివిధ మ‌ధ్య స‌మ‌న్వ‌యం , శాఖల‌ సహకారాలు, నిష్ణ‌తులైన ప్రొపెస‌ర్స్ , వివిధ అంతర్జాతీయ సంస్థల‌తో భాగస్వామ్యంతో పాటు, పర్యావరణ హిత‌ వ్యవస్థలు ఏర్ప‌చ‌డం ద్వార‌ ఈ పురోగతికి ప్ర‌పంచ స్ధాయిలో పురోగ‌తికి సాధిస్తుంది.

అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణలకు కేంద్రం

QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2027లో సాధించడం పట్ల ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ.. ఈ ఫలితాల‌ పురోగతికి , డీప్-టెక్ ఆవిష్కరణలు, వాటి అనుబంధ‌ పరిశోధనల‌తో కార‌ణ‌మ‌ని అన్నారు .ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ లో బలమైన విద్యా వ్యవస్థ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింద‌ని అన్నారు. ఈ యేడాది ప్రపంచ స్థాయిలో 76 స్థానాలు మెరుగుపడి, పరిశోధన పత్రాల‌ సూచీలో (సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీలో) టాప్ 123లో స్థానం పొందడం మా పరిశోధనలు ప్రపంచ శాస్త్రీయ వేదికలపై ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. QS ర్యాంకింగ్ మెరుగుప‌డ‌టం మా అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు మరియు పరిపాలనా బృందం యొక్క సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అన్నారు. ఇది భవిష్యత్తులో మరిన్ని వ్యూహాత్మక రంగాల్లో అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తుంది అని అన్నారు.

2008లో సంగారెడ్డి జిల్లా కందిలో స్థాపించబడిన ఐఐటీ హైదరాబాద్ సంస్ధ‌, కేవలం 17 సంవత్సరాల వ్యవధిలో విద్యా, పరిశోధన, సాంకేతిక అభివృద్ధి మరియు స్టార్టప్‌ల రంగాలలో విశిష్ట స్థానం సంపాదించింది. NIRF-2025లో ఇంజినీరింగ్ విభాగంలో 7వ స్థానం, ఇన్నోవేషన్ విభాగంలో 6వ స్థానం సాధించింది. QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2027లో 588వ స్థానం, QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో 270వ స్థానం పొందింది. 345కు పైగా పూర్తి కాల అధ్యాపకులు, 355కు పైగా సిబ్బంది, 5,710కు పైగా విద్యార్థులతో ఐఐటీ హైదరాబాద్ బలమైన పరిశోధన ఆధారిత సంస్థగా ఎదిగింది. 13,750కు పైగా పరిశోధనా పత్రాలు, 2.76 లక్షలకు పైగా సైటేషన్లు, 755 పేటెంట్లు, సుమారు 300 స్టార్టప్‌లతో సంస్థ దేశంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>