కలం, సినిమా: తెలంగాణ నేపథ్యంలో వస్తున్న “ఇడుపు కాయితం” (Idupu Kayitham) సినిమా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని నెలల కిందట టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు పక్క రాష్ట్రం నుంచి సెటైర్లు ఎదుర్కొన్న ఈ సినిమా ఇప్పుడు తెలంగాణ ప్రజల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో, వంశీరెడ్డి దొండపాటి డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పెట్టిన కొన్ని సీన్లపై తెలంగాణలోని కొన్ని ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డిసెంబర్ 11న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. ఈ క్రమంలో సాంగ్స్, టీజర్స్ విడుదల చేస్తూ ఆడియెన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి గడప సాంగ్ రిలీజ్ అయ్యింది. దీంతో పాటు విడుదలైన కొన్ని పెళ్లి సీన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి భోజనాల సమయంలో బంతిలో కూర్చున్న వారికి భోజనంతో పాటు మద్యం పోయడం, కూర్చున్న వాళ్లు అక్కడే మందు తాగుతూ భోజనం చేయడం ఇందులో ఉంది. అయితే దీనిపై తెలంగాణలోని కొన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కల్చర్ గురించి, గ్రామీణ నేపథ్యాల గురించి సినిమాలో చూపించాలి కానీ, ఇలా లేనిపోనివి క్రియేట్ చేసి పరువు తీయొద్దని మండిపడుతున్నారు.
అసలు పెళ్లి భోజనాల్లో మద్యం పోయడం ఎక్కడైనా ఉంటుందా? అని హీరో ప్రియదర్శి, డైరెక్టర్ వంశీరెడ్డిలను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అనవసర సీన్లు పెట్టి మళ్లీ ట్రోలింగ్, విద్వేషాలకు గురికావొద్దని హెచ్చరిస్తున్నారు. తమ జిల్లాల పేర్లను చెప్తూ మా దగ్గర ఇలా ఉండదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఇడుపు కాయితం (Idupu Kayitham) టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Also Read : 11 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్.. బోధన చరిత్ర!
Follow Us On : WhatsApp

