శివన్నగూడెంలో దారుణం.. భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

కలం, మునుగోడు : వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్య చేసిన దారుణ ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం (Shivannagudem) గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుంకరి ఇంద్రయ్య తన భార్య రజిత (37)పై శనివారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.

గతంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు

సుంకరి ఇంద్రయ్య, రజిత దంపతులకు ముగ్గురు సంతానం. రెండేళ్ల క్రితం వారి కుమారుడు పురుగుల మందు తాగి వ్యవసాయ బావి సమీపంలో మృతి చెందినట్లు స్థానికుల సమాచారం. శివన్నగూడెం ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం నుంచి వలస వచ్చిన ఈ కుటుంబం ప్రస్తుతం శివన్నగూడెంలో నివాసం ఉంటోంది. గతంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. భార్యపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్న ఇంద్రయ్య ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

అయితే హత్యకు గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. హత్య ఘటనపై సమాచారం అందుకున్న నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు ఆధ్వర్యంలో మర్రిగూడ ఎస్సై బి. రాంబాబు పోలీస్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఇతర వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>