బ్యాట్‌లో ఏఐ చిప్స్ ఉన్నాయా? వైభవ్‌పై ఐస్‌ల్యాండ్ క్రికెటర్ సెటైర్!

కలం, స్పోర్ట్స్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్ ఉన్నాయంటూ ఐస్‌ల్యాండ్ క్రికెట్ పెట్టిన ఫన్నీ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మంగళవారం జెన్సన్ హువాంగ్ తిరిగి ఎన్విడియా సీఈఓగా రావడం, బుధవారం వైభవ్ బ్యాట్‌లోని ఏఐ చిప్స్ మళ్లీ పని చేయడం యాదృచ్ఛికం కాదని ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎక్స్‌లో సరదాగా రాసింది. వైభవ్ బ్యాట్‌కు ఎన్విడియా చిప్స్ శక్తి ఇచ్చాయేమోనని చమత్కరించింది.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో యూఏఈ-ఏతో జరిగిన కీలక మ్యాచ్‌లో వైభవ్ ఈ విధ్వంసం సృష్టించాడు. భారత్-ఏ తరఫున ఆడిన 15 ఏళ్ల వైభవ్ 28 బంతుల్లోనే వేగవంతమైన లిస్ట్-ఏ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ రికార్డును తిరగరాశాడు. ఆ తర్వాత 52 బంతుల్లో వేగవంతమైన లిస్ట్-ఏ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 53 బంతుల్లో 7 ఫోర్లు, 28 సిక్సర్లతో 204 పరుగులు చేశాడు. ఒకే ప్రొఫెషనల్ క్రికెట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ గెలుపుతో భారత్-ఏ సెమీఫైనల్‌కు చేరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>