కలం, వెబ్ డెస్క్: భారత్ – నేపాల్ మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఇరు దేశాలను కలుపుతూ చేపట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పట్టాలెక్కనుంది. అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ (Ayodhya-Janakpur Train) వరకు ప్రయాణించే వందేభారత్ రైలు నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ పీఎం బాలేంద్ర షా కలిసి వర్చువల్ విధానంలో లాంచ్ చేస్తారు.
రాముడి జన్మస్థలమైన అయోధ్య నుంచి సీతమ్మ జన్మస్థలంగా ప్రసిద్ధి గాంచిన నేపాల్ లోని జనక్ పూర్ కు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఆధ్యాత్మిక, పర్యాటక సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ రైలు సేవలు ఉపయోగపడనున్నాయి.
మొత్తం 604 కిలోమీటర్లు మేర ప్రయాణించే రైలు (Ayodhya-Janakpur Train) 10 స్టాపుల్లో ఆగుతుంది. అయోధ్య నుంచి ప్రతి సోమవారం ప్రారంభమయ్యే రైలు జయనగర్, మధుబని, శిషో, సీతామర్హి, నర్కటియాగంజ్, రక్సాల్, గోరఖ్ పూర్, బస్తీ, మాన్కాపూర్, అయోధ్య ధామ్ స్టేషన్ లో ఆగనుంది.

