epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

బడ్జెట్ పదం ఎలా పుట్టింది?

కలం, తెలంగాణ బ్యూరో: ఫ్రెంచ్ భాషలోని ‘బౌగెట్’, లాటిన్ భాషలోని ‘బల్గా’ అనే పదాల నుంచి ‘బడ్జెట్’ అనే పదం పుట్టింది. బౌగెట్ అన్నా, బల్గా అన్నా ‘తోలు సంచి’ అని అర్థం. అప్పట్లో బ్రిటన్ ఆర్థిక మంత్రి తోలు సంచుల్లోనే ఆర్థిక వ్యయాల లెక్కలను తెచ్చేవారు. అలా.. అది ‘బడ్జెట్’ (Budget) గా రూపాంతరం చెందింది.

బడ్జెట్ పెట్టిన బర్త్ డే బాయ్

బర్త్ డే నాడు బడ్జెట్ పెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ రికార్డులకు ఎక్కారు. ఆయన పుట్టిన రోజు ఫిబ్రవరి 29 (లీపు సంవత్సరం). 1964లో ఓసారి, 1968లో మరోసారి ఆ తేదీనే మొరార్జీ దేశాయ్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read Also: చట్టం తన పని తాను చేసుకుపోతుంది: శ్రీధర్ బాబు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>