Mobile Popup Ad
Mobile Popup Ad

లోయలోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది దుర్మరణం

కలం, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా (Chamba Accident ) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్టులతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం కలబన్ ప్రాంతం సమీపంలో అదుపు తప్పి సుమారు 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మంది దుర్మరణం చెందారు.

బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో కుటుంబం వేసవి సెలవుల కోసం డల్హౌసీ హిల్ స్టేషన్‌కు వచ్చిన వేళ ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మారుమూల ప్రాంతం కావడం, అక్కడ ఎలాంటి మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని చెప్పారు. కాగా, ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>