ఈశ్వర్ సాయికి బెయిల్ మంజూరు

కలం, వెబ్ డెస్క్: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి (Eshwar Sai)కి హై కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనను పెళ్లి పేరుతో మోసం చేశారని మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈశ్వర్ సాయిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై పోలీసుల తీరుపై మాధురి నిరసన తెలపగా.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆమెకు తెలిపారు. ఈ క్రమంలో ఈశ్వర్ సాయి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇరు పక్షాల వాదనలు..

హై కోర్టులో విచారణ సందర్భంగా ఈశ్వర్ సాయి తరఫున లాయర్ వాదనలు వినిపించారు. ఈశ్వర్ సాయికి ఇదివరకే వివాహమైందని.. మాధురి రాథోడ్ ఉద్దేశపూర్వకంగానే ఆయనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం సానుభూతి కోసమే తన క్లెయింట్‌పై తప్పుడు కేసు పెట్టారని హైకోర్టుకి వివరించారు. ఇరు వర్గాల వాదనల అనంతరం ఈశ్వర్ సాయికి బెయిల్ మంజూరు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>