అల్లూరి జిల్లాలో తెగిన వంతెన.. 75 ఊళ్లకు రాకపోకలు బంద్!

కలం, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ చిన్న గంగవరం గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి (Alluri Bridge) ఒక్కసారిగా కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం కారణంగా సుమారు 75 గ్రామాలకు వెళ్లే ప్రధాన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దారితెన్ను లేకపోవడంతో గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

వంతెన ధ్వంసం కావడంతో స్థానిక గిరిజనులు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి, అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రులకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోవడంతో గిరిజన ప్రాంత ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టి, శాశ్వత బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>