కలం, డెస్క్ : ఉపాయం ఉండాలే గానీ ఎలాగైనా డబ్బు సంపాదించొచ్చు అన్నదానికి మేడారం మహాజాతరలో (Medaram Jatara) జరుగుతున్న కొన్ని చిన్న బిజినెస్ లే ఉదాహరణగా చెప్పాలి. ప్రస్తుతం మేడారం మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. దీంతో భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకున్న వ్యాపారస్తులు చిన్న చిన్న బిజినెస్ లతో బాగానే సంపాదిస్తున్నారు. మేడారంలో (Medaram Jatara) బకెట్ వేడి నీళ్లకు రూ.50 దాకా తీసుకుంటున్నారు. అలాగే మొబైల్ ఛార్జింగు పెట్టిస్తే రూ.50 నుంచి డిమాండ్ ను బట్టి రూ.100 దాకా తీసుకుంటున్నారు. దీంతో పాటు జంపన్న వాగులో స్నానాలు చేసేందుకు వెళ్లే భక్తుల లగేజీకి కాపలాగా ఉంటూ ఒక్కొక్కరి వద్ద రూ.50 దాకా తీసుకుంటున్నారు కొందరు స్థానికులు. టూత్ పేస్టులు, సబ్బులు, షాంపూలు, మంచి నీళ్లు, ఫుడ్, టవల్స్, మటన్, చికెన్ లాంటి బిజినెస్ లకు బాగానే డిమాండ్ ఉంది. కాకపోతే ధరలు భారీగా ఉండటంతో భక్తులకు ఇబ్బందిగా మారింది.


