బిగ్ అలర్ట్.. రేపు ఫోన్ పే, గూగుల్ పే సేవలు బంద్..!

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి (HDFC) కీలక ప్రకటన చేసింది. సిస్టమ్ అప్ గ్రేట్ పనుల కారణంగా రేపు (శనివారం) తెల్లవారుజామున బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుందని తెలిపింది.కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలను ముందే ప్లాన్ చేసుకోవాలని సూచించింది. బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం.. రేపు తెల్లవారుజామున 2:30 AM నుండి 6:30 AM వరకు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయి.

సిస్టమ్ అప్ గ్రేట్ కారణాంగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ(UPI)లు, నెట్ బ్యాంకింగ్ , మొబైల్ బ్యాంకింగ్ , ఫండ్ ట్రాన్స్ ఫర్లు (IMPS, NEFT, RTGS) వంటి సేవలకు అంతరాయం ఉంటుందని పేర్కొంది. అయితే ఏటీఎం, ‘Zapp’ వాలెట్ సేవలు మాత్రం ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా కొనసాగుతాయని బ్యాంక్ స్పష్టం చేసింది. అప్‌గ్రేడ్ సమయంలోనూ డెబిట్ కార్డుల ద్వారా రూ. 5,000 వరకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. అత్యవసర లావాదేవీలు ఉన్నవారు ఈ సమయాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఖాతాదారులకు సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>