హర్మన్‌ప్రీత్ ‘ప్రపంచ క్రికెట్‌కే రోల్ మోడల్’ !

కలం, స్పోర్ట్స్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)  మరో అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 ప్రపంచకప్ (T20 World Cup) మ్యాచ్‌లో బరిలోకి దిగితే ఆమె కెరీర్‌లో 200వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనుంది. ఈ చారిత్రక మ్యాచ్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ ఆవిష్కర్ సాల్వీ హర్మన్‌ప్రీత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కేవలం భారత క్రికెట్‌కే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లందరికీ ఆమె ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నాడు.

ఎన్నో ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో నిలకడగా రాణిస్తూ యువ ఆటగాళ్లకు మార్గదర్శకురాలిగా ఉంటోందని కొనియాడాడు. ఏ ఫార్మాట్‌లోనైనా జట్టుకు విజయాలు అందించడమే కాకుండా, తన అనుభవాన్ని యువ క్రికెటర్లతో పంచుకుంటూ వారిని ప్రోత్సహించడం హర్మన్‌ప్రీత్ ప్రత్యేకత అని సాల్వీ వెల్లడించాడు. కష్టపడి పనిచేసే ఆమె తత్వమే ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పాడు.

ఇక దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు కూడా హర్మన్‌ప్రీత్ (Harmanpreet Kaur) ప్రభావాన్ని గుర్తించారు. ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని, మహిళల క్రికెట్ అభివృద్ధికి కీలకంగా నిలిచిందని ప్రశంసించారు. 17 ఏళ్ల క్రితం ఇదే ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో టీ20 అరంగేట్రం చేసిన హర్మన్‌ప్రీత్, ఇప్పుడు అదే వేదికపై 200వ మ్యాచ్ ఆడబోతోంది. వ్యక్తిగత మైలురాయితో పాటు దక్షిణాఫ్రికాపై గెలిచి సెమీఫైనల్ దిశగా మరో అడుగు వేయాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: కివీస్‌ను కూల్చిన భారత అమ్మాయిలు.. నేషన్స్ కప్ ఛాంపియన్స్‌గా ఘన చరిత్ర!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>