విద్యార్థుల బాధ వర్ణనాతీతం: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా ఇంజినీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాలు వచ్చిన చేరలేని పరిస్థితి ఉందని, వారి బాధ వర్ణానతీతమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఇప్పటికీ ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదన్నారు. దీంతో, కార్పొరేట్ కంపెనీల్లో ఏడాదికి మంచి ప్యాకేజీతో జాబ్స్ తెచ్చుకున్నా.. ఆఫర్ లెటర్లు పట్టుకుని ఏడుస్తూ కూర్చోవాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. ఈ మేరకు తనను కలిసిన పలువురు విద్యార్థులను అడిగి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

సాఫ్ట్ కాపీలు కూడా ఇవ్వడం లేదు..

ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు కనీసం సర్టిఫికేట్ల సాఫ్ట్ కాపీలు కూడా ఇవ్వడం లేదని హరీశ్ రావు విమర్శించారు. ఎంత బతిలాడినా.. ఇవ్వబోమని మొండికేస్తున్నాయని వివరించారు. దీంతో పేద కుటుంబాల పిల్లల కలలు కల్లలు అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్సార్ ప్రారంభించినా.. కేసీఆర్ ఎంతో గొప్పగా కొనసాగించారని గుర్తు చేశారు.
రూ.20 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసి లక్షలాది మంది విద్యార్థులకు కేసీఆర్ అండగా నిలిచారన్నారు. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత వివక్ష అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం రూ.వేల కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వం.. పేద విద్యార్థుల ఫీజులు మాత్రం ఎందుకు చెల్లించడం లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>