రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయింది: హరీశ్ రావు

కలం, మెదక్ బ్యూరో: రెవెన్యూ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. రెండున్నరేళ్లలో ధరణిని భూ భారతిగా మార్చడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదని, రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రెవెన్యూ అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారన్నారు. గురవారం సిద్దిపేట (Siddipet) అర్బన్ తహసీల్దార్ కార్యాలయాన్ని హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రిజిస్ట్రేషన్ అయ్యాక కేవలం వారం రోజుల్లోనే పాస్ బుక్స్ వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు నెలలు అయినా అతీగతీ లేదన్నారు.

బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం‌లో 20 వేల మందికి ఉచితంగా సాదాబైనమా చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేటి వరకు అడ్రస్సే లేదన్నారు. నిషేధిత భూముల వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారం‌లోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేస్తామని మాట తప్పిందని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు.

Read Also : జింబాబ్వే టార్గెట్ 257.. ఎట్టకేలకు ఊపందుకున్న భారత్..

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>