వనపర్తిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

కలం, వనపర్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 10 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర (Har Ghar Tiranga Campaign)లో భాగంగా జిల్లా కేంద్రంలో జాతీయ జెండాలు పంపిణీ చేపట్టారు. జిల్లా కన్వీనర్‌ బచ్చు రాము ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లకు మువ్వన్నెల జెండాలను కట్టారు.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త, నాయకుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. స్వాతంత్య్రానికి ప్రతీకగా నిలిచే మువ్వన్నెల జెండా ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి, అన్ని వర్గాల ప్రజలను హర్‌ ఘర్‌ తిరంగా (Har Ghar Tiranga) కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బచ్చు రాము, అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, సబీరెడ్డి వెంకట్‌రెడ్డి, కేతూరి బుడ్డన్న, ఆర్‌.వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, వారణాసి కల్పన, సీనియర్‌ నాయకురాలు సుమిత్రమ్మ, బాసెట్టి శ్రీనివాసులు, అలివేలమ్మ, బండారు కుమారస్వామి, కాటమొని కృష్ణగౌడ్‌, కౌన్సిలర్‌ విజయసాగర్‌, చిన్నరాయుడు, తిరుపతయ్య యాదవ్‌, వెంకటేష్‌నాయక్‌, జానునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ప్లాస్టిక్ నోట్లపై కేంద్రం సంచలన ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>