అనంత‌పురంలో బ‌ర్డ్ ఫ్లూతో 2,500 కోళ్లు మృతి!

క‌లం, వెబ్‌డెస్క్: అనంతపురం (Anantapur) జిల్లాలో బర్డ్ ఫ్లూ (Bird Flu) కలకలం రేపుతోంది. సిద్ధపురంలో నెల రోజుల వ్యవధిలో 2,500 వరకు నాటు కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. బ‌ర్డ్ ఫ్లూ వ‌ల్ల మృతి చెందిన కోళ్ల‌తో రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్టం వాటిల్లిన‌ట్లు బాధితులు వెల్లంచారు. దాదాపుగా అన్ని కోళ్లు ఒక ర‌క‌మైన ల‌క్ష‌ణాల‌తో మృతి చెందిన‌ట్లు తెలిపారు. కోళ్ల మృతిపై అనుమానాలు ఉండ‌టంతో నమూనాలను పరీక్షలకు పంపించారు.

ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మ‌రోవైపు అధికారులు వైర‌స్ వ్యాపించ‌కుండా జిల్లాలోని కోళ్ల ఫామ్ య‌జ‌మానుల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌లు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్తున్నారు. గుడ్లు, చికెన్‌ను బాగా ఉడికించి తినాల‌ని సూచిస్తున్నారు. మ‌రోవైపు అధికారులు ఎంత చెప్తున్నా బ‌ర్డ్ ఫ్లూ వార్త‌ల‌తో ప్ర‌జ‌లు చికెన్ తినేందుకు భ‌య‌ప‌డుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>