కలం, కరీంనగర్ బ్యూరో: కవిత (Kavitha) కొత్త పార్టీతో ప్రధాన పార్టీల్లో భయం నెలకొందని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) అన్నారు. కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ అనే రాజకీయ పార్టీని ప్రకటించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు. తెలంగాణ పేరును వాడుకున్న కొన్ని రాజకీయ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కవిత నాయకత్వంలో ‘తెలంగాణ రక్షణ సేన’ కేవలం తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు కవిత నాయకత్వమే రక్షణగా ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణ ప్రజల మీద వివక్ష చూపుతుందని మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుని ఢిల్లీకి నిధులు తరలిస్తుందని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని వదిలేసిందని విమర్శించారు. కవిత కొత్త పార్టీతోనే తెలంగాణలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

