epaper
Monday, March 2, 2026
epaper

స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి.. సీఎంకు రిక్వెస్ట్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో అనుభవమున్న గ్రూప్-1 అధికారులతో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఆ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల్లో అనుభవం ఉన్న గ్రూప్-1 ఆఫీసర్లను స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లుగా నియమించాలని కోరారు. పాలనలో అనుభవం కలిగిన సీనియర్ గ్రూప్-1 అధికారులను వివిధ కార్పొరేషన్‌లకు ఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని రిక్వెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని కలిసి ఈ అంశంపై వివరించిన గ్రూప్-1 ఆఫీసర్ల అసోసియేషన్ బృందంలో అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్, పలువురు గ్రూప్-1 అధికారులు ఉన్నారు.

తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసె ఏర్పాటుపై 2015లోనే ఈ విషయంపై ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటైందని, ఇప్పటికీ ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదికనే ఇవ్వలేదని సభ్యులు వివరించారు. గ్రూప్-1 పోస్టులన్నింటినీ స్టేట్ సివిల్ సర్వీస్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే గ్రూప్-1 అధికారులతో మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారని అసోసియేషన్ సభ్యులు వివరించారు. సీఎంను కలిసిన వారిలో శశికిరణా చారి, అరవింద్ రెడ్డి, నూతనకంటి వెంకట్, పద్మావతి, భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్. సోమ శేఖర్ తదితరులు ఉన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!