కలం వెబ్ డెస్క్: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు గంగుల హరిహరన్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ముఖ్య నేతలంతా పెళ్లికి తరలివచ్చారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం పెళ్లికి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్, నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 29న రాత్రి కరీంనగర్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.

