‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. !

కలం, వెబ్ డెస్క్ : సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ ఫాంటసీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘రాకాస’ (Rakasa 0TT) డిజిటల్ సందడికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ మే 1, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన హోమ్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా నిర్మించిన ఈ చిత్రానికి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ఫేమ్ మానస శర్మ దర్శకత్వం వహించారు. హారర్ ఎలిమెంట్స్‌కు కామెడీని జోడించి రూపొందించిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి, బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>