ఆదిలాబాద్‌లో వైభవంగా మహా కోటి దీపోత్సవం

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని మార్వాడి ధర్మశాల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాకోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనూ, ప్రపంచంలోనూ సగం జనాభా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఆడపిల్లలకు విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో తల్లిదండ్రులు పూర్తి సహకారం అందిస్తేనే ఆశించిన లక్ష్యాలను సాధించగలమని స్పష్టం చేశారు. ఆలయ వేదికగా గణేశ్ ఉత్సవాలు, కార్తీక దీపోత్సవం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం అభినందనీయమన్నారు.

కార్తీక మాసంలో జిల్లాలోని జైనథ్ స్వామినారాయణ ఆలయంలో జరిగే జాతరతో పాటు పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఈ పవిత్ర మాసంలో జిల్లా ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి కోరికలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తూ కార్తీక దీపోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వారికి కలెక్టర్, ఎస్పీ మెమంటో లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డీఎస్పీ, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సభ్యులు కందుల రవిందర్, రవిందర్ రేణికుంట, సంతోష్ అగ్రవాల్, పిల్లి మహిపాల్, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>