కలం, స్పోర్ట్స్: ట్రావిస్ హెడ్ దూరమైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాడు. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్‌ను తీసుకుంటే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ షెడ్యూల్, పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ట్రావిస్ హెడ్ 2027 ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ అతడిని విడుదల చేసింది. అభిషేక్ శర్మతో కలిసి హెడ్ విధ్వంసకర ఓపెనింగ్ జోడీగా నిలిచాడు. అయితే హెడ్ స్థానంలో షై హోప్‌ను తీసుకోవచ్చని చోప్రా సూచించాడు.
ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడితే టాప్ ఆర్డర్‌లో ఎడమ, కుడి చేతి బ్యాటర్ల కలయిక ఉంటుందని వివరించాడు. హెడ్ లాంటి ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యమేనని, పాట్ కమిన్స్ దూరమైతే మాత్రం జట్టుకు పెద్ద ఇబ్బంది ఎదురవుతుందని అభిప్రాయపడ్డాడు. 2024లో రూ.6.8 కోట్లకు సన్‌రైజర్స్‌లో చేరిన హెడ్.. తొలి సీజన్‌లోనే 567 పరుగులు చేశాడు. 2025లో 374, 2026లో 410 పరుగులు సాధించాడు. మొత్తంగా 43 మ్యాచ్‌ల్లో 1,351 పరుగులు చేశాడు. ఇప్పుడు అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది వేలంలో తేలనుంది.

