సాఫ్ట్‌బాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు జీఎంఎస్ విద్యార్థుల ఎంపిక

కలం, నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన సాఫ్ట్‌బాల్‌ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో (Softball Competitions) గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు (Gowtham Model Schools) ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.

క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రదర్శన కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ వెంటనారాయణ, డీన్‌ రాందాస్‌, ప్రిన్సిపాల్‌ జగతి, వ్యాయామ ఉపాధ్యాయుడు జె. సంజీవ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>