Mobile Popup Ad
Mobile Popup Ad

ఏకంగా రూ.10,000 పెరిగిన కిలో వెండి ధర

కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా వెండి ధర భారీగా పెరిగి ఆకాశాన్నంటింది. శుక్రవారం రూ.2,65,000 ఉన్న కిలో వెండి ధర శనివారం రూ.10,000 పెరిగి ఏకంగా రూ. 2,75,000కు ఎగబాకింది. హైదరాబాద్ లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,80,000 గా ఉంది. ఇక బంగారం ధర సైతం భారీగానే పెరిగింది. శుక్రవారం రూ. 1,54,970గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780 గా ఉంది. 1,42,050గా ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పలు ముఖ్య నగరాల్లో వేరువేరుగా ఉన్నాయి. హైదరాబాద్‌లో రూ.15,578, చెన్నైలో రూ.15,666, ముంబయిలో రూ.15,578, ఢిల్లీలో రూ.15,593, కలకత్తాలో రూ.15,578, బెంగుళూరులో రూ.15,578, పూణేలో రూ.15,578గా ఉంది. వడోదరలో రూ.15,583, అహమ్మదాబాద్‌లో రూ.15,583గా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>