శ్రేయస్ కెప్టెన్సీ అదుర్స్: గంభీర్

క‌లం, స్పోర్ట్స్‌: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఓటమి తర్వాత కూడా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కెప్టెన్సీ అద్భుతంగా ఉందంటూ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పేర్కొన్నాడు. అయితే టీమిండియా ఓటమితో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శ్రేయస్ చేతకానితనం, సరైన వ్యూహాలు లేకపోవడం, పరిస్థితులకు అనువైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇండియా ఓడిపోయిందన్న విమర్శలు వినిపించాయి. అయితే భారత హెడ్ కోచ్ గంభీర్.. ఈ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అయ్యర్ మంచి కెప్టెన్ అని తెలిపాడు. అనుభవం లేని బౌలింగ్ లైనప్‌తో కూడా మంచి ఫలితాలను అందుకున్నాడని, కివీస్‌కు గట్టి పోటీ ఇచ్చామని గంభీర్ వివరించాడు. ఐదో టీ20 ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన గంభీర్.. ఆసక్తికర విషయాలను చెప్పాడు.

‘‘అయ్యర్ కెప్టెన్ బాధ్యతలు అందుకున్నప్పుడు.. టీమిండియా చాలా సక్సెస్‌ఫుల్ టీమ్. వరల్డ్ కప్ గెలిచిన జట్టు. ఆ తర్వాత చాలా మంది బలమైన ప్రత్యర్థులను ఇండియా ఎదుర్కొంది. అంతే చాలా మంది యువ ప్లేయర్లకు అవకాశాలు అందించింది. ఆ ప్రయాణంలో భారత్‌కు అనుభవం చాలా కొరవడింది. కానీ ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే వరల్డ్ కప్ కోసం జట్టును సిద్ధం చేస్తున్నామంటే.. యంగ్ టాలెంట్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఆ క్రమంలో ఓటములు వచ్చినా.. అవి పాఠాలే తప్ప.. తప్పిదాలు కావు. వరల్డ్ కప్ తర్వాత భారత్ ప్రయాణంలో ఎంత అనుభవం వచ్చిందో మీకు తెలీదు. మరీ ముఖ్యంగా బౌలింగ్ లైనప్‌లో చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. ఇవన్నీ చూసుకుంటే బౌలింగ్ లైనప్‌లో అనుభవం ఇంత తక్కువగా ఉన్నా టీమిండియాను బలమైన జట్టుగా నిలబెట్టి శ్రేయస్ అద్భుతమైన పని చేశాడు” అని గంభీర్ వివరించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>