అంగన్వాడీ పోస్టుల భర్తీపై కలెక్టర్ కీలక వ్యాఖ్యలు

కలం, ఆదిలాబాద్ :  గాదిగూడ (Gadiguda) మండలంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల నియామక ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో మంద మకరందుతో కలిసి ఆయన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శిశు సంక్షేమాన్ని బలోపేతం చేయడంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకమని తెలిపారు. అర్హులైన ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే అంగన్వాడీ టీచర్ల నియామక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టామని అన్నారు.

ఈ నియామకానికి సంబంధించి మొత్తం 283 దరఖాస్తులు రాగా, అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి 47 మందిని అర్హులుగా, మిగతా 236 దరఖాస్తులను అనర్హతగా గుర్తించినట్లు తెలిపారు. అర్హత సాధించిన 47 మందిలో 46 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, ఒక్కరు మాత్రమే గైర్హాజరైనట్లు వివరించారు. ఎంపిక ప్రక్రియలో పూర్తిగా మెరిట్, నిబంధనలకే ప్రాధాన్యం ఇచ్చామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాధన, గిరిజన సంక్షేమ శాఖ డీడీ అశోక్, ఇతర సంబంధిత శాఖల అధికారులు, అభ్యర్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read :  కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హరీశ్‌రావు కంచుకోటను బద్దలు కొట్టేనా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>