Mobile Popup Ad
Mobile Popup Ad

ఉమ్మడి మెదక్ జిల్లాలో పెట్రోల్ కష్టాలు

కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది. ప్రభుత్వాలు పెట్రోల్, డిజిల్ పుష్కలంగా ఉందని చెబుతున్నా పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు తప్పడం లేదు. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ధరలు పెరుగుతాయన్న భయం, పెట్రోల్ కొరత ఉందన్న ప్రచారం నమ్ముతున్న ప్రజలు భారీగా బంకుల వద్ద క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి మెదక్ వ్యాప్తంగా..

ఉమ్మడి మెదక్ (Medak)వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ కొరత ఎఫెక్ట్‌తో మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనుగండ్లలోని దుంపలకుంట చౌరస్తాలోని పెట్రోల్ బంక్ వద్ద ఖాళీ క్యాన్లతో పెట్రోల్ బంకులకు వినియోగదారులు క్యూ కట్టారు. పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో లేదోనన్న ఆందోళనతో, ముందు జాగ్రత్తగా ఖాళీ డబ్బాలతో పెట్రోల్ కోసం ప్రజలు. బారులు తీరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>