విద్యార్థులు మొబైల్ ఫోన్లు చూడటం తగ్గించాలి: శ్రీనివాస్

కలం, జగిత్యాల: విద్యార్థులు మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూడడం తగ్గించాలని జగిత్యాల జిల్లా ఉప వైద్యాధికారి డా. శ్రీనివాస్ సూచించారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా సోమవారం జగిత్యాల మండలం జిల్లా పరిషత్ హైస్కుల్ గోపాలరావుపేట (ZPHS Gopalraopet) లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం (Eye Screening Camp) సోమవారం నిర్వహించారు.

ఈ శిబిరం(Eye Screening Camp)లో మొత్తం 71 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా.. 14 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులోనే పిల్లలకు కంటి పరీక్షలు చేయడం ద్వారా దృష్టిలోపాన్ని ముందే గుర్తించి అంధత్వాన్ని నివారించవచ్చని అన్నారు. గుర్తించిన 14 మంది విద్యార్థులకు త్వరలోనే ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అవసరమైన వారిని ఉన్నత చికిత్సకు రిఫర్ చేస్తామని అన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు చూడటాన్ని తగ్గించాలని, అందుకు పేరెంట్స్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాస్ సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటరమణ, మెడికల్ ఆఫీసర్లు డా. స్వాతి, డా. శ్రావణ్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ కె. తిరుపతి, ఏఎన్ఎం రవళి, తదితరులు పాల్గొన్నారు.

Also Read : మెస్సీ చివరి మ్యాచ్‌కు రెడీ!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>