ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు

కలం, నిర్మల్ : ఆదిలాబాద్‌ జిల్లాలో కానిస్టేబుల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న 60 రోజుల ప్రత్యేక ఉచిత శిక్షణ (Free Coaching)కు దరఖాస్తుల గడువును ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక శిక్షణలో మొత్తం 200 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో 100 మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులకు, 100 మంది ఎస్‌ఐ అభ్యర్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ వరకు ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు. అభ్యర్థుల ఎంపికను నిర్దేశిత రిజర్వేషన్‌ ప్రకారం చేపట్టనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు: ఫోన్‌: 08732-221280, 9949684959, 9494149416 బీసీ స్టడీ సర్కిల్‌, ఎస్సీ స్టడీ సర్కిల్‌, ఆదిలాబాద్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>