దేశానికి ఆదర్శంగా ఉండే విద్యా పాలసీ తెస్తాం: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యారంగంలో ఆధునిక విధానాలు తీసుకొచ్చేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. దేశానికి ఆదర్శంగా నిలబడే విద్యా పాలసీని తెస్తామని ప్రకటించారు. సామాజిక వెనుకబాటుతనానికి కారణం విద్య మాత్రమే కారణమని పేర్కొన్నారు. సరళీకరణ విధానాలతో ప్రపంచ విద్యా విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

దేశంలో ఎన్నో ప్రధాన విద్యా సంస్థలకు నెహ్రూ పునాది వేశారని సీఎం కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతి జిల్లాకో యూనివర్సిటీ వచ్చిందని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థపై సీపెక్ సర్వే ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. విద్యా రంగ అభివృద్ధికి సభ్యుల విలువైన సలహాలు తీసుకుంటామని చెప్పారు. యాదవులు ఆర్థికంగా ఉన్నా.. విద్యలో వెనుకబడి ఉన్నారని చెప్పుకొచ్చారు. విద్యా శాఖ అత్యంత కీలకం కాబట్టి.. ఆ శాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>