సాగర్‌లో విదేశీ బౌద్ధ భిక్షువుల బిక్షాటన

కలం, నాగార్జునసాగర్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ లో విదేశీయ బౌద్ధ భిక్షువుల బృందం (Buddhist Monks) శనివారం పిండపాత (బిక్షాటన) కార్యక్రమాన్ని నిర్వహించింది. కొన్ని రోజులుగా థాయిలాండ్, కంబోడియా దేశాలకు చెందిన విదేశీ బౌద్ధ భిక్షువుల బృందం వర్షా వాస కార్యక్రమంలో భాగంగా బుద్ధ వనములో ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. వారి దినచర్యలో భాగంగా నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ (Nagarjuna Sagar)లోని పలు వీధులలో భిక్షాటన చేస్తున్నారు.

విదేశీ బౌద్ధ భిక్షువులు నివాసాలలో భిక్షాటనకై వచ్చినప్పుడు స్థానికులు స్వచ్ఛందంగా వారికి తోచిన ఆహార పదార్థాలను దానం చేస్తున్నారు. అంతేగాక బౌద్ధ బిక్షువులను తమ నివాసాలలో ఆహార పదార్థాలు స్వీకరించడానికి రమ్మని స్వయంగా ఆహ్వానిస్తున్నారు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీ, హిల్ కాలనీలలో పలు వీధులలో వీరి భిక్షాటన కొనసాగుతూ ఉంది. శనివారం హిల్ కాలనీలోని రెండవ వార్డు పరిధిలో ఈ విదేశీ బౌద్ధ భిక్షువుల బృందం భిక్షాటన చేశారు. వీరితో బుద్ధ వనం సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>