కలం, మహబూబ్ నగర్ బ్యూరో : అఖిల భారత యువజన సమాఖ్య (AIYF Telangana ) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల్లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కామ్రేడ్ డి. రామును భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర, జాతీయ, జిల్లా నాయకులు శనివారం సీపీఐ పార్టీ ఆఫీసులో అభినందించారు. యువజన సమస్యలపై నిరంతరం పోరాడుతూ, నిరుద్యోగం, విద్య, ఉద్యోగ అవకాశాలు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం డి. రాము చేసిన కృషిని నాయకులు అభినందించారు. విద్యార్థి, యువజన ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించిన రాముకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు దక్కడం సంతోషకరమని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులు, జిల్లా నాయకులు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు డి. రామును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యువత సమస్యలపై మరింత విస్తృతంగా ఉద్యమాలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు అండగా నిలవాలని, ఏఐవైఎఫ్‌ను రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

