కలం వెబ్ డెస్క్ : పెట్టుబడులు పెట్టాలని చాలామంది భావిస్తారు. కానీ రిస్క్ తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. అలా రిస్క్ తక్కువ ఉండాలని భావించే పెట్టుబడిదారులకు ప్రభుత్వం మంచి అవకాశాలు కల్పిస్తుంది. అవే స్మాల్ సేవింగ్స్(Small Savings) స్కీమ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్(Fixed Deposit)లు. ఇవి చాలా సురక్షితం.. రిటర్న్స్ కూడా డీసెంట్‌గానే ఉంటాయి. అయితే పెట్టుబడి కోసం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఎంచుకోవాలా? లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోవాలా? అన్నది చాలా మందికి గందరగోళంగా మారుతుంది. ఈ రెండిటి మధ్య దేనిని ఎంచుకోవాలో ఒక నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. కానీ సరైన సమాచారం ఉంటే నిర్ణయం తీసుకోవడం చాలా సులభం అవుతుంది.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అనేది ఒక సాధారణ, పాపులర్ ఆప్షన్. దీనిలో మీరు బ్యాంక్‌లో నిర్దిష్ట సమయం పాటు డబ్బు పెట్టతారు. ఆప్షన్ ప్రకారం 1, 2, 3, 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా ఎంచుకోవచ్చు. FD ముఖ్యంగా షార్ట్ టర్మ్ అవసరాలకు బాగుంటుంది. వడ్డీ రేట్లు బ్యాంక్ మీద ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం సాధారణంగా 6.25శాతం నుండి 7.5శాతం మధ్య వడ్డీ రేటు ఉంది. ఎఫ్‌డీ వల్ల ఉండే పెద్ద లాభం ఏమిటంటే.. మెచ్యూరిటీ ముందు డబ్బు తీసుకోవచ్చు. ఇది చిన్నపాటి అత్యవసరాలకు చాలా సులభం. కానీ FDలో వడ్డీపై ట్యాక్స్ కట్టాలి. ఇది మీ ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ ఆధారంగా ఉంటుంది.
స్మాల్ సేవింగ్ స్కీమ్స్
స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అనేవి ప్రభుత్వ స్కీమ్స్. వీటిలో ట్యాక్స్ మినహాయింపు, లాంగ్ టర్మ్ రిటర్న్, పూర్తిగా సురక్షితం అనే లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలకు తెలిసిన పథకాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC), కిసాన్ వికాస్ పాత్రా(KVP), సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్(SCSS), మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్(MIS), సుకన్య సమృద్ధి స్కీమ్(Sukanya Samriddhi Scheme).
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లాంగ్ టర్మ్ కోసం బాగా ఉపయోగపడుతుంది. 15 సంవత్సరాల లాక్ ఇన్ ఉంటుంది, కానీ వడ్డీ 7.1% ఉంటుంది, ఇది ట్యాక్స్ ఫ్రీ. రిటైర్మెంట్ లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఇది చాలా సురక్షితం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) మిడ్ టర్మ్ కోసం ఉపయోగపడుతుంది. 5 సంవత్సరాల లాక్ ఇన్, వడ్డీ 7.7%, ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. కిసాన్ వికాస్ పత్రం (KVP) కూడా 5-7 సంవత్సరాల లాక్ ఇన్, 7.5% వడ్డీ, మిడ్ టర్మ్ లక్ష్యాలకు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) 5 ఏళ్ల లాక్ ఇన్, 8.2% వడ్డీ, సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా. పోస్ట్ ఆఫీస్ మెన్త్‌రీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) నెలవారీ ఆదాయం ఇచ్చే స్కీమ్, 7.4% వడ్డీ, 5 ఏళ్ల లాక్ ఇన్. సుకన్య సమృద్ది స్కీమ్ బాలికల భవిష్యత్తు కోసం, 15 ఏళ్లు లాక్ ఇన్, 8.2% వడ్డీ, ట్యాక్స్ ఫ్రీ.
స్కీమ్స్ లావాదేవీల విషయంలో, FD లాగా సులభం కాదు. పోస్టాఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్‌లో లాగిన్ అయ్యి ఫారమ్ భర్తీ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ (Aadhaar, PAN, బ్యాంక్ అకౌంట్) సమర్పించాలి. FD కంటే లిక్విడిటీ తక్కువ, ముందే డబ్బు తీసుకోవడం కష్టమే. కానీ వడ్డీ ఎక్కువ, ట్యాక్స్ సేఫ్, భద్రత గ్యారంటీ ఉంది.
వీటిని ఎలా ఉపయోగించాలి అంటే, నిపుణులు సూచించేది పెట్టుబడి లక్ష్యాల ప్రకారం మిక్స్ చేయడం. షార్ట్ టర్మ్ అవసరాలకు ఎఫ్‌డీ, మిడ్ టర్మ్ గోల్స్ కోసం ఎన్‌ఎస్‌సీ లేదా కేవీపీ, లాంగ్ టర్మ్ కోసం పీపీఎఫ్. సీనియర్ సిటిజెన్స్‌కి ఎస్‌సీఎస్ఎస్ బాలికల భవిష్యత్తు కోసం, సుకన్య సమృద్ధి యోజన. ఇలా చేయడం ద్వారా, లిక్విడిటీ, రిటర్న్, ట్యాక్స్ మినహాయింపు, సురక్షితత అన్ని కలుస్తాయి.
వడ్డీని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోకూడదు. FDలో షార్ట్ టర్మ్ లిక్విడిటీ, అవసరమైతే డబ్బు తేలికగా తీసుకోవచ్చు. స్మాల్ సేవింగ్స్‌లో లాంగ్ టర్మ్ లాక్ ఇన్ ఉంటే, పెనాల్టీ లేకుండా డబ్బు ముందే తీసుకోలేరు. కానీ వీటిలో వడ్డీ ఎక్కువ, ట్యాక్స్ ఫ్రీ, భద్రత గ్యారంటీ. మొత్తం మీద, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లు రిస్క్ తక్కువ, లాంగ్, మిడ్, షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఎఫ్‌డీ, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, ఎస్‌సీఎస్ఎస్, ఎంఐఎస్, సుకన్య సమృద్ధి యోజనను మిక్స్ చేయడం ఉత్తమమైన ఆప్షన్. ఇది ఫిక్స్ రిటర్న్ ఇస్తుంది, భవిష్యత్తులో ఎమర్జెన్సీస్ కోసం డబ్బు అందిస్తుంది, ట్యాక్స్ కూడా సేవ్ అవుతుంది.


