కలం, నాగర్ కర్నూల్: కరెంట్ కోతలను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం కోడేరు మండలం తీగలపల్లి సబ్స్టేషన్ (Teegalapalli Substation) వద్ద బావాయిపల్లి, జనంపల్లి, తీగలపల్లి రైతులు విద్యుత్ సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన (Farmers Protest) నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు సాగునీళ్లు ఇవ్వకుండా, మరోవైపు అడ్డగోలు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని అవేదన వ్యక్తం చేశారు.
24 గంటల హామీ.. 12 గంటల సరఫరా
24 గంటలు అంటున్నా 12 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారన్నారు. అది కూడా కేవలం 3 గంటల చొప్పున మాత్రమే విడతలుగా కరెంట్ ఇస్తున్నారని అన్నారు. దీనివల్ల వరి పొలాలు ఎండిపోతున్నాయని అన్నారు. జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్ అధికారులు మాత్రం పై నుంచి రావడం లేదంటున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

