యూరియా చల్లుతుండగా పాముకాటు.. రైతు మృతి

కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గంగారం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన ఈసం సూర్యనారాయణ (50) అనే రైతు (Farmer) బుధవారం ఉదయం పొలంలో యూరియా చల్లుతుండగా పాము కాటుకు గురయ్యాడు. పాము కాటేసిన విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం నర్సంపేట ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌లో బయలుదేరారు. అయితే మార్గమధ్యలోనే సూర్యనారాయణ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>