బాల్ ట్యాంపరింగ్ వివాదం.. ఖవాజాపై ఫానీ డి విల్లియర్స్ ఫైర్

కలం, స్పోర్ట్స్ : ఉస్మాన్ ఖవాజాపై (Usman Khawaja) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫానీ డి విల్లియర్స్ తీవ్రంగా మండిపడ్డాడు. ఖవాజాను తాను చూసిన అతిపెద్ద ద్రోహిగా అభివర్ణించాడు. సహచర ఆటగాళ్లను అమ్ముకున్నాడని ఆరోపించాడు. ఎనిమిదేళ్ల క్రితం ముగిసిన బాల్ ట్యాంపరింగ్ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ఆస్ట్రేలియా క్రికెట్‌కు చెడ్డపేరు తెస్తున్నాడని విమర్శించాడు. 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడింది. ఈ ఘటనలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై చర్యలు తీసుకున్నారు.

అయితే, తన ఆత్మకథ ‘సబ్ర్’ లో ఖవాజా ఈ ఘటనపై కొత్త విషయాలు వెల్లడించాడు. బంతి ఆకారాన్ని మార్చే విషయం జట్టులో అందరికీ తెలుసని పేర్కొన్నాడు. ఈ వ్యవహారానికి ముగ్గురినే బాధ్యులను చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలపైనే ఫానీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికే తప్పుకు తగిన చర్యలు తీసుకున్నారని గుర్తుచేశాడు. ఇప్పుడు మళ్లీ ఈ అంశాన్ని బయటకు తీయడం వల్ల జట్టులో స్నేహం, నమ్మకం దెబ్బతింటాయని అన్నాడు. ఖవాజా (Usman Khawaja) తన సహచరుల నమ్మకాన్ని వమ్ము చేశాడని విమర్శించాడు.

మరోవైపు, ఈ వివాదంపై కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ కూడా స్పందించాడు. బాల్ ట్యాంపరింగ్ గురించి జట్టులో చాలామందికి తెలుసని వెల్లడించాడు. శాండ్‌పేపర్ వాడకాన్ని సహచరులు, కోచింగ్ సిబ్బంది ప్రోత్సహించారని పేర్కొన్నాడు. అయితే, పాట్ కమిన్స్ ఈ ఆరోపణలను ఖండించాడు. తన వైఖరిలో మార్పు లేదని అతడి ఏజెంట్ స్పష్టం చేశాడు. ఈ వివాదం మళ్లీ తెరపైకి రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్వతంత్ర వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read : రావల్పిండిలో పాక్ జోరు.. లంకను చిత్తు చేసి సిరీస్ సొంతం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>