కలం, వెబ్డెస్క్: ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి (Ex-Army Employee) క్షణికావేశానికి ఓ కుక్క బలైపోయింది. ఖమ్మం (Khammam) జిల్లాలోని ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి తన పొరుగువారి పెంపుడు కుక్కను ఎయిర్ గన్తో కాల్చి చంపాడు. బాధితుడు రాము ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రాము పెంపుడు కుక్క తరచూ మాజీ ఆర్మీ ఉద్యోగి రౌతు జనయ్య ఇంటికి వెళ్తుండేది. ఇదే విషయమై ఇరువర్గాల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు, గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగ్రహించిన జనయ్య ఎయిర్ గన్తో ఆ కుక్కపై కాల్పులు జరిపాడు. దీంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

