ఘోర విషాదం.. ట్యాంకర్ పేలి 31 మంది సజీవదహనం!

కలం, వెబ్ డెస్క్ : ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Cairo Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. గిజా గవర్నరేట్‌లోని నైలు నదికి సమీపంలో ఉన్న కైరో రింగ్ రోడ్డుపై పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తున్న ఒక ట్యాంకర్ ట్రక్కు మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఈ అగ్నికీలలు పక్కనే ఉన్న వాహనాలకు వ్యాపించడంతో సుమారు 27 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ దుర్ఘటనలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యల కోసం 39 అంబులెన్సులను ఘటనా స్థలానికి తరలించారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వాటిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలను సేకరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశించారు.

Also Read : యూపీలో హంగ్ సంకేతాలు.. సర్వేలో కీలక అంశాలు!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>