Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండ జిల్లాలో ఆ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి: డీవైఎఫ్‌ఐ

కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) డిమాండ్ చేసింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ రామాచారికి డీవైఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేశ్ మాట్లాడుతూ.. జిల్లాలో కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తూ తల్లిదండ్రులను, విద్యార్థులను నిలువునా మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

‘కొన్ని విద్యాసంస్థలు ప్రైమరీ (ప్రాథమిక) తరగతుల వరకే అనుమతి తీసుకుని, హైస్కూల్ వరకు తరగతులు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని సంస్థలైతే ఒక బ్రాంచ్‌కు మాత్రమే అనుమతి పొంది, నగరవ్యాప్తంగా అనేక బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి.’ మల్లం మహేశ్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సామాన్యులకు భారంలా మారిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి ప్రతి పాఠశాల గుర్తింపు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి గుర్తింపు లేని పాఠశాలలపై తనిఖీలు చేపట్టాలని, లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ (DYFI) నల్లగొండ మండల కార్యదర్శి కండె యాదగిరి, సంఘం ముఖ్య నాయకులు బూర్గు గోపికృష్ణ, గద్దపాటి రఘువరన్, మాదాసు శ్రవణ్, గుణాలపూరి బాలరాజు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>