Mobile Popup Ad
Mobile Popup Ad

ఏంట్రా ఇది.. మందు లేదన్నారని వైన్ షాప్ ను తగలెట్టాశాడు

కలం, వెబ్ డెస్క్ : మాములుగానే మందుబాబులు చేసే రచ్చ మాములుగా ఉండదు. అలాంటిది నషాలో ఉన్న వ్యక్తికి మద్యం లేదంటే వాళ్లు చేసే అతి అంతాఇంతా కాదు. ఇలాంటి ఘటనే ఒడిశా (Odisha) లో చోటుచేసుకుంది. టైం కాకముందే మందు లేదన్నారని ఏకంగా పెట్రోల్ పోసి వైన్ షాపుకి నిప్పంటించాడు.

మంగళవారం రాత్రి యువకుడు స్కూటర్‌పై వచ్చి షాపు షట్టర్‌పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పాండ్రా పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Read Also: కారులో ఉంచిన వాటర్ బాటిల్ నీళ్లు తాగుతున్నారా? ఆరోగ్యానికి ఈ ప్రమాదాలు తప్పవు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>