కలం, వెబ్ డెస్క్: 2026 సంక్రాంతి (Sankranti) సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఏయే సినిమాలు ప్రేక్షకులను అలరించాయి అన్నదానిపై ప్రముఖ నిర్మాత, పంపిణీదారు దిల్ రాజు (Dil Raju) తనదైన స్టైల్‌లో తీర్పునిచ్చారు. జనవరి 8న ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ ప్రీమియర్ షోలతో పండుగ సీజన్ ప్రారంభమైంది. పండుగ సీజన్ ముగుస్తున్నందున ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ఐదు సినిమాలపై దిల్ రాజు కామెంట్స్ చేశారు.
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు, శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి స్పష్టమైన విజేతలుగా నిలిచాయని ఆయన వెల్లడించారు. ఈ చిత్రాల నటులు, నిర్మాతలకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాలను తెలంగాణ ప్రాంతంలో విడుదల చేసే అవకాశాన్ని తన పంపిణీ సంస్థకు కల్పించారన్నారు. మన శంకర వర ప్రసాద్ గారు మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లతో రేసులో ముందంజలో ఉంది. అనగనగ ఒక రాజు, నారి నారి నడుమ మురారి అంచనాలను మించి మంచి కలెక్షన్లు సాధించాయి.


