ఎన్నికలకు రెడీ.. ప్రకటించిన దానం

కలం, వెబ్ డెస్క్: తన ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు అనర్హత వేటు వేయడంపై దానం నాగేందర్ స్పందించారు. తన అనర్హతపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను రెడీ అని.. ఎన్నికలకు సిద్ధమని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్తేమీ కాదని.. ఎన్నికల యుద్ధాలు చాలా చేశామని, యుద్ధంలో కచ్చితంగా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దానం నాగేందర్ వ్యాఖ్యలతో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచన మానుకున్నట్లు వెల్లడవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>