ఖమ్మంలో దళిత హక్కుల పోరాట సమితి కలెక్టరేట్ ముట్టడి

​కలం, ఖమ్మం బ్యూరో: దళితుల అభివృద్ధి, సంక్షేమంలో ప్రభుత్వం వివక్ష వీడాలని, రాజ్యాంగ హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం డీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం (Khammam) నగరంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించి, కలెక్టర్ అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో పాటు దళితులకు సమాన హక్కులు కల్పించాలన్నారు. గురుకులాలు హాస్టళ్లలో వసతుల మెరుగుదలతో పాటు ఇందిరమ్మ ఇళ్లలో దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించి, గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్మూలించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, డీహెచ్‌పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>